ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర అప్రమత్తమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అసోం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ముఖ్యమంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. పర్యాటకులు కనీసం కోవిడ్ మార్గదర్శకాలను కూడా పాటించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్ర హోంశాఖ కూడా సీరియస్ అయ్యింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కేంద్ర హోంశాఖా కార్యదర్శి ఎస్.ఆర్. భల్లా కూడా హెచ్చరించారు.