contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉద్యోగాల కల్పనలో సర్కార్ విఫలం తెలుగు యువత

 

కరీంనగర్ జిల్లా: విద్యావంతులైన యువతీ, యువకులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు యువత నగర అధ్యక్షుడు అక్కపెల్లి బ్రహ్మచారి విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తానన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతీ, యువకులను మోసం చేశారన్నారు తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఆనాడు ఎంతో మంది యువకులు ఉద్యమానికి ఊపిరిపోసి ఆత్మబలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. అయినా కేసీఆర్ కు నిరుద్యోగ యువత పైన కనికరం లేదని విమర్శించారు నీళ్లు, నిధులు,నియామకాల పేరుతో ఉద్యమం జరిగిందని, అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ తెలంగాణ వస్తే ప్రతి ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీలను తుంగలో తొక్కారన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఊరికొక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, నిరుద్యో యువతకు నిరుద్యోగ భృతి రూ.3016/-లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ అమలు చేయయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ యువత తిరగబడి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు మరో ఉద్యమం చేపట్టక తప్పదని హెచ్చరించారు. చాలా మంది యువకులు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ జారీ చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బంగారు తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితో ఉ న్నారని, ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపైన సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్క ళ్యాడపు ఆగయ్య, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు జెల్లోజి శ్రీనివాస్,ఎస్సీ సెల్పా ర్లమెంట్ అధ్యక్షుడు బోలుమల్ల సదానందం, తెలుగు యువత నాయకులు జావీద్, సతీష్త దితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :