contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎన్‌ఎండీసీలో ఉద్యోగావకాశాలు

 హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)కు  చెందిన జార్ఖండ్‌లోని టాకిసుడ్‌ నార్త్‌ కోల్‌మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  మొత్తం పోస్టుల సంఖ్య: 89

  •  పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌)–02, లెయిజనింగ్‌ ఆఫీసర్‌–02, మైనింగ్‌ ఇంజనీర్‌–12, సర్వేయర్‌–02, ఎలక్ట్రికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ ఓవర్‌మెన్‌–25, మెకానికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ సిర్దార్‌–38.

  •  అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ సిర్దార్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

  •  ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ పోస్టుల ఇంటర్వ్యూ ఆధారంగా; సూపర్‌వైజర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు రాతపరీక్ష సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  •  పరీక్షా విధానం: రాతపరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్‌వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌కు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

  •  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  •  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021

  •  వెబ్‌సైట్‌: www.nmdc.co.in
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :