యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రం.
త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో పాన్-ఇండియన్ మూవీగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ పవర్ ఫుల్ టైటిల్‌ని లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తారక్ మూవీ కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని టాక్ నడుస్తోంది. సినిమా లాంచ్ సమయంలో ఈ టైటిల్ ను ప్రకటించే యోచనలో ఉన్నారట మేకర్స్. అంతేకాదు ఈ టైటిల్‌కి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక ‘పెద్ది’ చిత్రంలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కాగా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం కొరటాల శివతో కలిసి పని చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 7న అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మార్చిలో ప్రారంభించి ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.