contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి కేబినెట్ లో హైకోర్టు తీర్పుకు అనుగుణంగ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

  • హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇళ్ల పట్టాల పథకంలో మార్పులు
  • భోగాపురం ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్
  • రైతులకు పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్
  • ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపారు. కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఇవే.
  • హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఇళ్ల పట్టాల పథకంలో చేసిన మార్పులకు ఆమోదం.
  • ప్రభుత్వం నుంచి పొందిన స్థలంలో ఇంటిని నిర్మించుకుని ఐదేళ్లు నివాసం ఉన్న తర్వాతే విక్రయాలకు ఆమోదం.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ. 50 వేల ఆర్థిక సాయం.
  • రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి గ్నీన్ సిగ్నల్
  • రామయపట్నం పోర్టు మొదటి దశకు అవసరమైన భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్.
  • కురపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణం.
  • జగనన్న విద్యా దీవెన సాయాన్ని నాలుగు విడతలుగా అందించాలని నిర్ణయం.
  • చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఫైబర్ నెట్ వంటి పథకాలలో అవినీతిపై సీబీఐ విచారణ.
  • గుంటూరు, మచిలీపట్నం, శ్రీకాకుళం నర్సింగ్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి.
  • రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ కు నిర్ణయం. దీని కోసం 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.
  • స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కు ఆమోదం. అవసరమైన సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్. 
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :