ఎపి ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ఏపీ ప్రభుత్వం మంజూరు చేయడం లేదని పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. ఈ అంశంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని, నిధులు విడుదలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కే) ప్రకారం ఎన్నికల కమిషన్ కు నిధులను ఆపేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీలను చేర్చారు.