ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు విరాళం ఇచ్చారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వస్వామి ఆలయం ముందు భాగంలోని మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళం ప్రకటించారు. ఆలయంలో నిన్న జరిగిన శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొనాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా హాజరు కాలేకపోయారు. కాగా, కేసీఆర్ పేరిట ఆలయ నిర్వాహకులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.