కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ను నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి గురువారం సందర్శించారు మొదటగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం స్వీకరించి.. పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు,పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, వాహనాల నెంబర్ ప్లేట్లను స్పష్టంగా గుర్తించే రెండు అత్యాధునిక కెమెరాల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మహిళా పోలీసులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్ లను కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రష్మి పెరుమాళ్ తో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఎల్ఎండి పోలీసుల పని తీరు పై ఐజీ ప్రశంసించారు. అలాగే కోవిడ్ సమయం లో ఎంత పోలీస్ సిబ్బంది కి కరోనా పాజిటివ్ వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు స్టేషన్ లో పలు రికార్డులతో పాటు స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అంతక ముందు పోలీసుస్టేషన్ ఆవరణలో సిపి కమలాసన్ రెడ్డి తో కలిసి ఐజి మొక్కలు నాటారు. ఎల్ఎండి పోలీసుల పని తీరు ను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎండి ట్రైనీ ఐపీఎస్ రష్మీ పెరుమాల్ ,సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్,ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీసు సిబ్బంది ఉన్నారు.