కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మామిడాల సురేందర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారం ప్రకటించడం హర్షణీయం. గతంలో చిగురుమామిడి మండలంలో పనిచేసిన సమయములోనే ఆయన చేసిన సేవలు,విధి నిర్వహణలో కనబరిచిన నిబద్దత ను గుర్తించి ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేయడం అభినందనీయం ఈ సందర్బంగా శనివారం రోజు కరీంనగర్ లో ఎస్సై సురేందర్ ను చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్, మర్యాదపూర్వకంగా కలిసి అభినందిస్తూ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాంబారి కొమురయ్య జిల్లా రైతు బంధు సభ్యులు,గాదె రఘునాథ రెడ్డి,తదితరులు ఉన్నారు