contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు…

ఆంధ్రప్రదేశ్ ఎనిమింది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.

ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ బదిలీ అయ్యారు.

రవాణా శాఖ కమిషనర్ గా ఎంటీ కృష్ణబాబు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు, క్రీడలు యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :