కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో… బ్లాక్ ఫంగస్ వ్యాధి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని బారిన పడిన వారు కంటి చూపును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే… ఈ ఫంగస్ ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చింది. అంతేకాదు రాష్ట్రంలోని పలు కీలక ప్రభుత్వాసుపత్రుల్లో దీని ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.
ఏపీలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రులు ఇవే:
అనంతపూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)
ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి
స్విమ్స్, తిరుపతి
జీజీహెచ్, కాకినాడ
జీజీహెచ్, గుంటూరు
జీజీహెచ్ (రిమ్స్), కడప
జీజీహెచ్, విజయవాడ
గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్
జీజీహెచ్, కర్నూలు
జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు
జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు
జీజీహెచ్, శ్రీకాకుళం
ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం
గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం
ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)
కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం
విమ్స్, విశాఖపట్నం.