ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలను మారుస్తూ తీసుకొచ్చిన జీవోతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్, మరో పద్నాలుగు మంది దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను నెల 28కి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.అడ్వకేట్ జనరల్ (ఏజీ), పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలను దాదాపు గంటపాటు న్యాయస్థానం వింది. ఈ కేసుకు సంబంధించి అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. దీంతో ఈ నెల 24వ తేదీలోపు అడిషనల్ అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, అడిషనల్ అఫిడవిట్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఈ నెల 27వ తేదీ లోపు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది.