contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఒక సియం తమ్ముడు సాధారణ ఆర్మీ జవాన్ …. ఎవరో తెలుసా ??

 

ఒక ముఖ్యమంత్రి తమ్ముడంటే ఎలా ఉండాలి. నాలుగు బెంజ్ కార్లు, నాలుగు స్పోడ్స్ బైకులు, చేతినిండా డబ్బు, కావాల్సినవన్నీ ఇంతటి వచ్చి పడేంత పవర్. కానీ వీటన్నిటికీ దూరంగా, ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ దేశ సరిహద్దుల్లో జవాన్ గా పనిచేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ సోదరుడు. భారత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యోగి సోదరుడు దేశ జవానుగా సేవలందిస్తున్నారు. అది కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన లైన్ అఫ్ ఏయే యాక్చవల్ కంట్రోల్ వద్ద అత్యంత కఠినమైన పరిస్థితులలో విధులు నిర్వర్తిస్తుండటం విశేషం … బహుశా ఇది వినడానికి ఆశ్చర్యంగా , అతిశయంగా ఉండొచ్చు … కానీ నిజం … ఆయనే సుబేదార్ శైలేంద్ర మోహన్… శైలేంద్ర మోహన్ సాక్ష్యాత్తు ఉత్తరప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాద్ గారికి స్వయానా తమ్ముడు …యోగి ఆదిత్యనాథ్ సోదరులలో అందరికన్నా చిన్నవాడైన శైలేంద్ర మోహన్ ప్రస్తుతం “ఘర్వాల్ స్కౌట్ యూనిట్” లో సుబేదార్ గా చైనా సరిహద్దు ప్రాంతమైన “మన్న బోర్డర్ ” వద్ద దేశ రక్షణ భాధ్యతలు నిర్వహిస్తున్నారు … “మన్న” అనేది ఉత్తరాఖండ్ లోని భారతదేశ సరిహద్దుకు చిట్టచివరనున్న అతి చిన్న గ్రామం … 3,200 అడుగుల ఎత్తులో పూర్తిగా పర్వతాలతో నిండి ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ చైనీస్ సైనికుల చొరబాట్లు ఏక్కువగా ఉంటాయి … ఈ ప్రాంతం సెక్యూరిటీ పరంగా అత్యంత క్లిసతమైన ప్రాంతం కావడంతో విధులు నిర్వర్తించే భారత సైనికులు సంవత్సరం పొడవునా 24 గంటల పాటు గస్తీ తిరుగుతూ ఉంటారు … ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ టుడే న్యూస్ చానల్, సరిహద్దుల వద్ద గస్తీ నిర్వహిస్తున్న శైలేంద్ర మోహన్ ను కలుసుకుని ఈ విషయాన్ని ప్రస్థావించగా ” ఇది మన మాతృభూమి, మన దేశాన్ని కాపాడుకొవడం కోసం ఏటువంటి త్యాగాలకైనా సిద్దంగా ఉండాలి.అందుకే సంవత్సరం పొడవునా ఇక్కడ గస్తీ నిర్వహిస్తుంటాము … ఇది మాకు ఒక చాలెంజ్ లాంటిది” అని ఆయన సమాధానమిచ్చారు … యోగి ఆదిత్యనాథ్ గారు ముఖమంత్రి అయిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే శైలేంద్ర మోహన్, యోగి గారిని కలిసారుట … ఈ సంధర్బంగా యోగి గారు శైలేంద్ర మోహన్ తో ” మనం ఖచ్చితంగా మాతృభూమి ఋణం తీర్చుకొవాలి. నీ సామర్ధ్యం ఉన్నంతవరకు దేశ సేవకు అంకితమై ఉండు. ఒకరి సిఫార్సుల మీద ఆధారపడకుందా కేవలం నీ శక్తి సామర్ధ్యాల మీదనే నమ్మకముంచి పనిచెయ్యి” అని చెప్పారట యోగి..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :