వలస కూలీల దీన స్థితికి అద్దం పట్టే ఘటన ఇది. ఇది చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీలో బందీ అయిపోయిన కూలీలు కడుపు నింపుకునేందుకు ఆహారం దొరక్క నానా ఇక్కట్లు పడుతున్నారు. కడుపు నిండే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.ఈ క్రమంలో కొందరు వ్యక్తులు తినడానికి పనికిరాని అరటిపండ్లను శ్మశానంలో పారబోశారు. వాటిని చూసిన వలస కార్మికులు అక్కడికి చేరుకుని ఎగబడి మరీ వాటిని ఏరుకుని తిని కడుపు నింపుకున్నారు. మంచిగా ఉన్న మరికొన్నింటిని ఏరుకుని తమతోపాటు తీసుకెళ్లారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటికలో జరిగిన ఈ ఘటన చూసిన వారి కళ్లలో నీళ్లు నింపింది. తమకు రోజూ ఆహారం దొరకడం లేదని, దీంతో దొరికినవాటితోనే కడుపు నింపుకుంటున్నట్టు సమాచారం ఇకైనా అధికారులు స్పందించి వారికి పట్టెడన్నం పెట్టె కార్యక్రమం చేపట్టాలని కోరుకుందాం .