కరీంనగర్ జిల్లాలోని పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ నుండి తిమ్మాపూర్ సీఐ గా శశిధర్ రెడ్డి, ఇక్కడ పని చేసిన మహేష్ గౌడ్ టాస్క్ ఫోర్స్ కి, కరీంనగర్ ఎస్బీ నుండి నాగేశ్వరరావు చొప్పదండికి, మంచిర్యాల నుండి కాగజ్నగర్ రూరల్ కి రాజేంద్రప్రసాద్, మంచిర్యాల పీసీఆర్ కి అల్లం నరేందర్, చొప్పదండి సీఐగా పని చేసిన ఓ.రమేష్ వరంగల్ డీఐజీ అటాచ్ గా బదిలీ అయ్యారు