కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(ఇందిరా భవన్)లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరియు గ్రామ కమిటీలు మరియు బూతు కమిటీల నియామకంపై చర్చించడం జరిగింది
ఈకార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మాకర్ రెడ్డి,సత్యనారాయణ రావు,టీపీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు,మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాలుగోన్నారు