కరీంనగర్ పట్టణంలోని శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో 125వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఆయన చూపిన అత్యంత సహసపోతమైన చర్యలు బ్రిటిష్ వారిని గడగడలాడించేందుకు ఇతర దేశాలతో కలిసి ప్రత్యేకంగా అజాద్ హిందూ పౌజ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం చరిత్రలోనే ఒక మరిచిపోలేని ఘట్టంగా చెప్పుకోవచ్చు అన్నారు స్వతంత్ర సమరంలో అయిన ధైర్యసాహసాలు విభిన్న తరహా పోరాటాలు అయినా జీవిత చరిత్రను సువర్ణఅక్షరాలతో లిఖించడానికి అర్హులని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి 23న నేతాజీ జయంతి పరాక్రమ దివాస్ గా కేంద్ర ప్రభుత్వం జరపనున్నదని వివరించారు ఆయన దుర్మరణం ఒక విషాద సంఘటనగా అభివర్ణించారు కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లో సర్కిల్ డివిజన్ స్థాయి కార్యాలయాల్లో ఈ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో అడిషనల్ డిసిపి ( ఎల్అండ్ఓ) ఎస్ శ్రీనివాస్, జి చంద్రమోహన్,( పరిపాలన) సిపిఓ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉమేష్ కుమార్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, నటేష్, ఆర్ఐ లు మల్లేశం, జానీమియా, శేఖర్, కిరణ్ కుమార్, మురళి లతో పాటు పలువురు పోలీసు అధికారులు మినిస్టీరియల్ విభాగానికి చెందిన అన్ని స్థాయిల కు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు