- బస్టాండు అవరణలో సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కరపత్రాలు
- కరోనా – 2019 లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన 10 కోట్ల వలస కూలీలను ఆదుకోవాలని డిమాండ్
- అవకాశాల మేరకు లాక్ డౌన్ సడలింపు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, చర్ల మండల కేంద్రం లోని బస్టాండ్ ఆవరణలో సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరున వెలసిన కరపత్రాలు. కరోనా మహమ్మారి సామ్రాజ్యవాదుల కుట్ర అని సామ్రాజ్యవాద నిర్మూలనే దీని నివారణకు మార్గమని లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన 10కోట్ల మంది అసంఘటిత వలస కూలీలను ఆదుకోవాలని అవకాశాల మేరకు లాక్ డౌన్ సడలింపు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసిన సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ.