contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కలెక్టరు సారు బెల్టు షాపులను జర పట్టించుకోరా..?

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయ్యా!  కలెక్టర్ గారు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో బెల్టు షాపులు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. జిల్లా సరిహద్దుల్లో ఉండటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విచ్చలవిడిగా బెల్టు షాపులు పుట్టుకొచ్చిన ప్రాంతాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఒకటి. జిల్లా సరిహద్దుకు చేరువలో ఉన్న ప్రాంతం కావటం చేత వివిధ కారణాలతో ఉన్నత అధికారులు తనిఖీలు చేయని  నేపథ్యంలో మండలంలో  విపరీతంగా పుట్టుకొస్తున్న “బెల్ట్” షాపులు. కరోనా లాక్ డౌన్ పేరు చెప్పి ప్రతిరోజూ మద్యం దుకాణాలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూసేస్తారు, అవసరమైతే తెరవరు కానీ బెల్టు షాపులకు వెళ్తే రాత్రి పగలు తేడా లేకుండా అర్ధరాత్రి కూడా మద్యం విచ్చల విడిగా దొరుకుతుంది. ఈ విషయం తెలిసినా కూడా  సంబంధిత అధికారులు పట్టించుకోరు అనేది సామాన్య ప్రజల వాదన. వివరాల్లోకి వెళితే చర్ల మండల కేంద్రం మరియు చుట్టూ పక్కల గ్రామాలలో  కిరాణా షాపు, పాన్ షాపు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, కూల్ డ్రింక్ షాపులు ఇలా రిఫ్రిజిరేటర్ ఉన్న ప్రతి చోట మద్యం అమ్మకం జోరుగా సాగుతోంది. వాస్తవానికి మద్యం టెండర్ల సమయంలో మండల కేంద్రం లోని మేజర్ గ్రామ  పంచాయితీ పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాటుకు తీర్మానం అవ్వని నేపధ్యంలో కేశవపురం పంచాయితీ పరిధిలో తీర్మానం చేసి పంచాయితీ అనుమతితో గుంపెనగుడెం గ్రామంలో మూడు వైన్ షాపులకు షట్టర్లు నిర్మించారు. మేజర్ గ్రామ పంచాయితీ అయితే వ్యతిరేకంగా తీర్మానం ఇచ్చింది తాగమని పొద్దుగూకితే మండల కేంద్రంలో మద్యం వీర విహారం చేస్తుంది. వాస్తవానికి చెప్పలంటే పేరుకైతే మూడు దుకాణాలు కానీ అంతా సిండికేట్ అయ్యి వ్యాపారం సాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లైసెన్సులు ఉన్న షాపులో మంచి కంపెనీల సరుకు దొరకదు కానీ బెల్టు షాపుల్లో మాత్రం మిలటరీ బ్రాండ్ సరుకు కూడా దొరుకుతుంది. ఇక సంబంధిత అధికారుల విషయానికి వస్తే బెల్టు షాపులలో ఉన్నవి తీయటం మానేసి కొత్తవి తెరిపిస్తే మరీ మంచిది అన్నట్టు ఉంది వారి వైఖరి. ఎందుకంటే మద్యం వ్యాపారులు మద్యం దుకాణాలలో గరిష్ట ధరకు మించి అమ్మలేరు కాని బెల్టు షాపులకు ఇచ్చే మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ అధిక లాభాలు పొందచ్చు అనేది మద్యం వ్యాపారుల ఆలోచనగా కనిపిస్తోంది. అటువంటి ఆలోచనలతో  బీరు సీసాలకు  ఒక్కింటికి  20 రూపాయలు అదనంగా, లిక్కరు 180 ml కి 50/-, 360ml కి 100/- ఇంక ఫుల్ కి అయితే ఏకంగా 200/- ఎక్కువ వసూలు చేస్తున్నారు. అలా చేయటం ద్వారా వచ్చే ఆదాయంలో సంబంధిత అధికారులకు కూడా వాట వస్తున్న నేపధ్యంలో “దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దు” అన్నట్లు అధికారుల ధోరణి కనిపిస్తుంది. జిల్లాకు  మారుమూల ప్రాంతం కావటం చేత అందరూ కుమ్మక్కై త్రాగే  వాడు ఎలాగూ త్రాగుడు మానడు కనుక వారిని ఇంకా లూటీ చేస్తున్నారు. మందు మానలేని  పేద ప్రజలు బెల్టు షాపుల్లో ఎక్కువ ఇచ్చి కొనలేరు, ఎందుకంటే ఇక్కడ మద్యం దుకాణాల అధిక ధర, బెల్టు షాపులు వారు బీర్లు కూలింగ్ పెట్టటానికి లేదా లిక్కర్ సీసాలు దాయటానికి గాను అధిక ధర ఇంకా వాళ్ళ లాభం అన్ని కలిపి అది మధ్యతరగతి సామాన్య మానవుడికి తలకు మించిన భారం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కాని తాగే నాలుక గమ్మున ఉండని నేపధ్యంలో షాప్ కి వెళ్లి నాసిరకం సరుకు తెచ్చుకొని ఆరోగ్యాన్ని ఇంక హానికరంగా మార్చుకుంటున్నారు. ఏదైనా  ఎవరైనా సమాచారం ఇస్తే వచ్చే అధికారులు ఏదో రకంగా ముందు  మద్యం వ్యాపారులకు సమాచారం ఇస్తారు. వారు  వచ్చే సరకి ఇక్కడ అంతా నిశబ్దం. సమాచారం ఇచ్చిన వాళ్ళని లేదా నోరు విప్పిన వాళ్ళని “నోట్లతో లేదా నోటి మాటతో బెదిరించి” మళ్లీ బెల్టు షాపులు మొదలు పెడతారు. ఇక్కడ సెటిల్ చేయటం కుదరని పక్షంలో మద్యం వ్యాపారులు  అధికారులకు సమాచారం ఇవ్వగా వారికి ఇక్కడ జరిగే తంతు తెలిసిన నేపధ్యంలో జాప్యం చేస్తు ఈ రోజు కాదు మరుసటి రోజు వస్తామని దాట వేస్తారు. కొన్నిసార్లు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు చేయటం కుదరదని దాట వేస్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ రావాలంటే   జిల్లా పాలనా అధికారి స్పందించి బెల్టు షాపులు తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నాను.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :