contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కలెక్టర్ సిగ్గు పడింది….కలెక్టరమ్మ ఎందుకు సిగ్గుపడింది..? ఏమిటీ ఆ వింత కథ..?

ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…
  అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…
  ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…
  ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…
 రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు… 
  నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…
   ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…
  ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…
  మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!
కొత్తగా జిల్లాకు రాగానే 10రోజులు హంగామా హైరానా చేసి ప్రజలలో మంచి పేరు సంపాదించుకొని ఆ తరువాత యదతాదంగా మారిపోయే కలెక్టర్లు ఉన్న ఈ సమాజంలో  ఇలాంటి మానవత్వం, మంచితనం,ప్రజలగురించి ఆలోచించే కలెక్టర్లు 100కో 1000కో ఒకరు అరుదుగా కనబడతారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :