ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు ప్రకటించారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ రోజు, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆశ్చర్యకరంగా మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్ గా కూడా వర్క్ \\
కాగా ఈ సినిమాలో శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. పైగా ఈ సినిమాలో మోహన్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.
ఇక మరో సినిమా విషయానికి బ్రహ్మానందం మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ‘పంచతంత్రం’. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్‌ను జర్నీ ఆఫ్ వ్యాస్ పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైరయి 60 ఏళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనే వ్యక్తిగా వేద వ్యాస్ పాత్రలో బ్రహ్మి నటిస్తున్నారు.