భారత్, చైనా బలగాల మధ్య లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈ ఘటనపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాయితీయ అధ్యక్షులు వి. సుధాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కీర్తించారు. సంతోష్ త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/07/ఎమ్మిగనూరు-లో-కార్గిల్-విజయ్-దివస్-వేడుకలు-.webp)