ఈ నెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ”19 పని దినాల పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి…” అని బిర్లా వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఓం బిర్లా ఈ మేరకు ప్రకటించారు. సాధారణంగా ప్రతియేటా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారం నుంచి ప్రారంభమై ఆగస్టు 15కు ముందు ముగుస్తాయి.