తమిళనాడులోని సేలంలో ఓ పోలీసు అధికారిని మాజీ ఎంపీ, డీఎంకే నేత కె.అర్జునన్ కాలితో తన్ని రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. కొవిడ్-19 వ్యాప్తి కట్టడిలో భాగంగా అక్కడి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులు.. అర్జునన్ వెళ్తున్న వాహనాన్ని ఆపి ఈ-పాస్ చూపించాలని అడిగారు.దీంతో ఆ మాజీ ఎంపీకి చిర్రెత్తుకొచ్చింది. నన్నే ఆపుతావా? అంటూ పోలీసులతో గొడవకు దిగారు. పరుష పదజాలంతో దూషిస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగి తిరిగి వెళ్లి కారులో కూర్చుకున్నారు. అయితే, ఆగ్రహం తగ్గకపోవడంతో మళ్లీ కారు దిగి కాలితో తన్నాడు .