శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీకి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు (37) వీరమరణం పొందారు. కార్గిల్ సమీపంలోని గల్వా న్‌కు 100 కిలోమీటర్ల దూరంలో శనివారం బాంబులు నిరీర్యం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలిపోవడంతో ఉమామహేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స ప్రారంభించిన అర్ధగంటలోనే మృతి చెందారు. 1983లో జన్మించిన ఉమామహేశ్వరరావు 2003, మార్చి నెలలో సైన్యంలో చేరారు. ఇప్పటివరకు 17 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని మరో రెండేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండగా ప్రమాదంలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు, బంధు వులు, స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 20న లాక్‌డౌన్ ప్రకటించే వారం రోజుల ముందు వరకు ఉమామహేశ్వరరావు సెలవుపై వచ్చి భార్యా పిల్లలతో శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ తర్వాత సైనిక అధికారుల నుంచి పిలుపురావడంతో బయల్దేరి వెళ్లారు . శనివారం ఉదయం బాంబులను వెతుకుతున్నప్పుడు తీసిన ఫొటోలను కూ డా భార్యాపిల్లలకు వాట్సాప్ ద్వారా పంపించారు. పిల్లలు, భార్యతో మాట్లాడి తాను బాగానే ఉన్నానని చెప్పగా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయంపై ఆదివారం ఉదయం హడ్కో కాలనీలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉమామహేశ్వరరావుకు భార్య నిరూష (32), పదేళ్లు, నాలుగేళ్లు వయసు కలిగిన వైష్ణవి, పరిణితి అనే కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో వీరు కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మృతదేహం నగరానికి చేరుకునే వీలున్నట్టు సమాచారాం .