హైదరాబాద్ : కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా, ఆ సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.