నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదం అయింది. దాంతో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు సమావేశం నిర్వహించి ఏం చేయాలన్న దానిపై చర్చించాలని భావించారు. అయితే సమావేశం జరుగుతున్న ప్రాంతం రెడ్ జోన్ లో ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేశారు. నందమూరి అభిమానులకు తాను భరోసాగా ఉంటానని తెలిపారు