contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు

  •   పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతి
  •  సామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం
  • పదుల సంఖ్యలో బాధితులు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు
నల్లగొండ : పెండ్లి సంబంధం కోసం మీ ఫోటో ఎవరికైనా ఇస్తున్నారా, ఆ వ్యక్తి గురించి మీకు అన్ని వివరాలు తెలిస్తేనే ఇవ్వండి….. లేదంటే ఇలా మోసపోతారని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు….
ఇలా అబ్బాయిల ఫోటోలను అమ్మయిల తల్లితండ్రుల వద్ద నకిలీ పేర్లతో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటుంది ఈ కిలాడీ లేడి… అంతే కాదు తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లితండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ కేసులలో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది ఈ మాయలేడి… ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు…
ఇక వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ఇందు దాసరి అలియాస్ ధరణి రెడ్డిపై వచ్చిన పిర్యాదు విచారించి నల్లగొండ వన్ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. ఈ కిలాడీ లేడీపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్ తమను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా తాము షేర్ చేసిన తమ ఫోటోలను ఉపయోగించి పెండ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం కుదిరిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లుగా తమకు తెలిసిందని పిర్యాదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. వెంకటేష్ పిర్యాదు మేరకు విచారణ చేయగా కిలాడీ లేడీ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ కు చెందిన బొమ్మెల వెంకటేష్ కు ఇందు దాసరి పేరుతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొని అతనితో నగ్నంగా వీడియో చాటింగ్ చేసి వాటిని తన వద్ద భద్రపర్చుకోవడమే కాకుండా అతని బంధువు, సోదరుడైన బొమ్మెల అనుదీప్ అనే వ్యక్తితో సైతం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని వారి ఫోటోలను సేకరించి గత మూడు నెలలుగా తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నదని, వారు అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలని నిలదీయడంతో డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులలో ఇరికిస్తానని బెదిరించినట్లు తెలిపారు. ముఖ్యంగా బొమ్మెల వెంకటేష్ కు ఇందు దాసరి అనే పేరుతో ఫేస్ బుక్ ఐ.డి.లో మహేశ్వరి అనే పేరుతో అనుదీప్ తో పరిచయము చేసుకొని అతనితో చాటింగ్ చేసి అతన్ని మరోచోటికి తీసుకొని వెళ్లి అతనికి తెలియకుండా చూపించిందని తెలిపారు. అనుదీప్ పటేల్ ను మరోచోట వాళ్ళకు కార్తీక్ పేరుతో పరిచయము చేసిందన్నారు.
కూకట్ పల్లిలో మహేశ్వరి అలియాస్ మహేశ్వరి రెడ్డి పేరుతో ఆమె, సంతోష్ అనే మరో వ్యక్తి కలిసి మణికంఠ అనే వ్యక్తిని ఫేస్ బుక్ ఫేక్ ఐ డి తో పరిచయం చేసుకొని అతని ఫోటోలు సంపాదించి, వాటిని తన దగ్గర పెట్టుకొని అతడిని బెదిరించి 4 లక్షల 50 వేలు వసూలు చేసిందని చెప్పారు. ఈ విషయంలో కూకట్ పల్లిలో కేసు నమోదు కాగా రిమాండ్ చేశారని తెలిపారు. ఆ తర్వాత ఘట్ కేసర్ పరిధిలో అబ్బాయి మాదిరిగా ఒక అమ్మాయిని ఫేస్ బుక్ లో పరిచయం చేసుకొని తన దగ్గర ఉన్న వేరే వ్యక్తుల ఫోటోలు చూపించి ఆమెను లవ్ చేస్తున్నట్టుగా చెప్పి, ఆ తర్వాత తన ఆమె యువతిని బెదిరించి ఒక లక్షా 75 వేలు వసూలు చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు.కేసు విచారణలో ఉన్నట్లు వివరించారు. ఖమం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పారావు అనే వ్యక్తి కూతురుకి పెండ్లి సంబంధము ఉన్నదని, అప్పారావుకు బంధువు అయిన కిలాడి లేడీ జయంత్ అనే వ్యక్తి ఫోటోలు చూపిస్తూ వాళ్లకు మాత్రం అతని పేరు కృష్ణహర్ష అని చెప్పి, వాళ్ల సోదరుడు వెంకటేష్.సిఐ ఉద్యోగం చేస్తున్నాడు, తాను సంబంధం కుదిరిస్తానని చెప్పడమే కాక, వాళ్ళు ఏడు లక్షలు అడుగుతున్నారని చెప్పి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నదని చెప్పారు. తరువాత వారు మోసపోయినట్లుగా తెలుసుకొని కేసు పెట్టినట్లు తెలిపారు. ఆలాగే నాగలక్ష్మి అనే అమ్మాయికి పెండ్లి సంబందాలు చూస్తున్నానని చెప్పి వాళ్లకు వెంకటేష్ తమ్ముడు అనుదీప్ పటేల్ ఫోటోలు చూపించి అతని పేరు పేరు కార్తీక్ అని చెప్పి మాయమాటలు చెప్పి ఫోను లో మహేశ్వరే అబ్బాయి మాదిరిగా మాట్లాడి వారిదగ్గర మూడు లక్షలు వసూలు చేసిందని, ఇలా మొత్తం 11 లక్షల 70 వేలు వసూలు చేసుకొని తప్పించుకొని నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో నివాసం ఉంటునట్లుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు వివరించారు.
ఈ కిలాడీ లేడీపై కూకట్ పల్లి, ఘట్ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్లతో పాటు కరింనగర్ షీ టీమ్, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసు విషయంలో తక్కువ వ్యవధిలో వివరాలు సేకరించి సమర్ధవంతంగా పని చేసిన మహిళా పొలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ గౌడ్, నల్లగొండ వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ నిగిడాల సురేష్ లను డిఐజి రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :