నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద ఓ శిక్షణ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పైలట్‌తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మహిమ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మహిళ తమిళనాడుకు చెందిన అమ్మాయని చెప్పారు. ఆ ఇద్దరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మాంసపు ముద్దలుగా ఉన్నాయి.
ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో మంటలు, పొగలు వచ్చినట్లు వివరించారు. ఆ హెలికాప్టర్ నాగార్జున సాగర్ వైపు నుంచి వచ్చినట్లు వివరించారు. కాగా, ఆ హెలికాప్టర్ నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీకి చెందినదిగా అధికారులు గుర్తించారు.