తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపారు.గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ కు పాజిటివ్ రాగా, ప్రస్తుతం ఆయన తమ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.