ఇండియా లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా తన పౌరులకు కీలక సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి నెమ్మదించే వరకు భారత పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి భారత పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోరింది. మరోవైపు, బ్రిటన్ కూడా భారత్‌ను తన ట్రావెల్ ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. ఈ నెల 25న భారత పర్యటనకు రావాల్సిన ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.