contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

క్రిస్స్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

క్రైస్తవుల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలోని ఓ పక్షన్ హాల్ లో మానకొండూర్ నియోజకవర్గ స్థాయి క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిరుపేద క్రైస్తవులకు మంజూరు చేసిన దుస్తుల పంపిణీ, విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైయి దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ పాపులలో మార్పును తీసుకరవడానికే యేసయ్య భువికి వచ్చాడని పేర్కొన్నారు.ఫాస్టర్లు.సమాజానికి సేవచేసే కార్యకర్తలు అన్నారు చనిపోయి తిరిగిలేచిన దేవుడు యేసు మాత్రమే అని చెప్పారు.యేసు యుగానికి, కాలానికి ప్రతీకగా నిలిచాడని, ఎదుటి వ్యక్తి సంతోషాన్ని కోరుకునేవాడే నిజమైన దేవుడు అని తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినవేడుకలలో పాల్గొనడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని కులాలను మతాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి పండగలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పేద క్రైస్తవులు సైతం ఉత్సాహంతో క్రిస్మస్‌ను జరుపుకోవాలని ముఖ్యమంత్రి దుస్తుల పంపిణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అనంతరం క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఎమ్మెల్యే పాస్టర్లతో కలిసి కేక్ కట్‌చేసి ముందస్తుగా క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్నీరు శరత్ రావు, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి , జడ్పీటీసీల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ గౌడ్, తిమ్మాపూర్ జడ్పిటిసి ఇనుకొండ శైలజ, గన్నేరువరం జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, గన్నేరువరం ఎమ్మార్వో కె రమేష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ,అధికారులు క్రైస్తవులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :