నందిగామ మండలం ముగనగచర్ల గ్రామానికి చెందిన క్రైమ్ ఇండియా రిపోర్టర్ నవీన్ దారుణ హత్యకు గురయ్యాడు. వారం రోజుల క్రితం నవీన్ కనబడుట లేదు అని అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..గోనెల సాయి రమణ అనే వ్యక్తులు కలసి హత్య చేసినట్లు గుర్తించారు, కాకతీయ స్కూల్ రహదారి లో ఒక ఇంటి వెనక ఖాళీ ప్రదేశంలో గుంతలు తవ్వి గంట నవీన్ మృతదేహాన్ని బయటకు తీశారు….
నందిగామ డిఎస్పీ జి.వి.రమణమూర్తి గంట నవీన్ హత్య కేసు విషయమై మీడియాతో మాట్లాడుతూ గంటా నవీన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా సాంకేతికంగా మరియు అతనితో సంబంధం వ్యక్తులను విచారించి నేపథ్యంలో గౌనెల సాయి మరియు గంటా నవీన్ కు గల పాత గొడవల కారణంగా ఇరువురు ఘర్షణ పడ్డారు… ఈ ఘర్షణలో గంట నవీన్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు నవీన్ హత్యకు పాల్పడిన గోనెల సాయి రమణ అనే వ్యక్తి సహాయం తో సమీపంలోనే గుంటను తవ్వి అందులో పాతి పెట్టగా ఎవరికైనా అనుమానం వస్తుందని తిరిగి 2 రోజుల క్రితం అక్కడనుండి మృతదేహాన్ని తన ఇంటి వెనుక కాళీ ప్రదేశంలో మరొక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు…
.నవీన్ హత్య కేసులో సాయి మరియు రమణ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని దర్యాప్తులో భాగంగా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకుంటామని డీఎస్పీ తెలిపారు….నవీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నందిగామ మార్చురీకి తరలించారు…