వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ‘గని’ సినిమాను రూపొందించాడు. అల్లు బాబీ .. సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై, దాదాపు ముఖ్య పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది .. ఈ సినిమాపై అంచనాలు పెంచింది. చాలా వేగంగా ఈ ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. లైక్స్ నెంబర్ కూడా చకచకా మారిపోతుండటం ఆశ్చర్యపరుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులుగా జగపతిబాబు .. నదియా నటించగా, ముఖ్యమైన పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర కనిపించనున్నారు.