కరీంనగర్ జిల్లా గన్నేరువరం నాయిబ్రాహ్మణుల మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా నాయిబ్రాహ్మణ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గన్నేరువరం మండలంలో స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని మండల తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నాయిబ్రాహ్మణులకు పుట్టుకతో వచ్చినటువంటి ఈ వృత్తిలోకి ఇతర కులాల వారు వచ్చి వీరి పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పూర్వీకుల నుండి తమ వృత్తిని నమ్ముకొని ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని కానీ కార్పొరేట్ రానున్న రోజుల్లో నాయిబ్రాహ్మణులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజున కులవృత్తి పోయిన తమకి భద్రత కల్పించాలని ఈ కుల వృత్తి లోకి ఇతర కులాల వారు రాకుండా ప్రత్యేకమైన జీవో గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గర్శకుర్తి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్షులు కంటే సంతోశ్ కుమార్ లు పాల్గొన్నారు నాయిబ్రాహ్మణుల పిలుపుకు మద్దతు తెలిపిన సిపిఐ నాయకులు మండల కార్యదర్శి రెడ్డి సహాయ కార్యదర్శి శ్రీశైలం అఖిలభారత యువజన మండల నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు