కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం గన్నేరువరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టిఆర్ఎస్ యువ సేవ కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్ మోహన్ రావు పాల్గొని వారు మాట్లాడుతూ మండలం ఏర్పడి అభివృద్ధిలో వివిధ విభాగాల్లో జిల్లాలోనే ముందంజలో నిలుస్తూ భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేస్తూ అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండల అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,న్యాత సుధాకర్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి, టిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు జాలి తిరుపతి రెడ్డి రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కొట్టే భూమయ్య, పుల్లెల సాయి కృష్ణ, ఇన్కొండ దత్తాత్రి, మెరుగు రాము, బొడ్డు శ్రీను, సాయి, రవి, శ్రీను, వంశీ తదితరులు పాల్గొన్నారు