కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల జర్నలిస్టులకు ఎమ్మెల్యే రసమయి దయాగుణాన్ని చాటుకున్నారు మానకొండూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పాటు గురువారం గన్నేరువరం మండల జర్నలిస్టులకు 25 కేజీల బియ్యం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పత్రికలు తన ప్రాణాలు పణంగా పెట్టి ఇలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా విధులు నిర్వహిస్తున్నారని వార్త సేకరణ చేస్తున్నారని ప్రశంసించారు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు పాఠకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో కరోనా పై ప్రజలను చైతన్యం చేయడంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గొప్పగా పని చేస్తున్నాయని అన్నారు పత్రికల వల్లనే ఈరోజు సమాచారం అందుతుందని ఆయా గ్రామాల్లోని పరిస్థితులు సమస్యలు ప్రభుత్వానికి తెలుసునని తన ద్వారా రోగులకు ప్రజలకు వివిధ రకాల మెరుగైన సేవలు లాక్ డౌన్ ద్వారా అని అన్నారు పత్రికల సేవలను అందరూ గుర్తించాలని కోరారు ప్రజలు లాక్ డౌన్ యథావిధిగా కొనసాగించాలని కరోనా అంతమయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు గన్నేరువరం మండలంలో కరోనా కట్టడి పై ఎస్సై ఆవుల తిరుపతి అభినందించారు ఈకార్యక్రమంలో ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మడుగులో రవీందర్ రెడ్డి కేడీసీసీ చైర్మన్ అల్వాల కోటి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్,బొడ్డు సునీల్,బూర వెంకటేశ్వర్ మానకొండూరు నియోజవర్గ యువజన సంఘాల అధ్యక్షుడు గూడూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు