కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: మందులేని కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు సోమవారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఆవరణంలో ఆయన మాట్లాడుతూ సోమవారం మండలంలో కరోనా వ్యాధి సోకిందని గ్రామాల్లో మండల కేంద్రంలో ప్రజలు పుకార్లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని కరోనా మహమ్మారి నుండి తరిమికొట్టేందుకు రేపటి నుండి అనగా మంగళవారం రోజునుండి ఎవరు కూడా బయటకు రావద్దని అత్యవసరము అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ఒకవేళ వెళ్తే మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ తో పాటించాలని కోరారు మండల ప్రజలు కరోనా తో ఆందోళనకు గురికాకుండా ధైర్యంతో ఉండాలని ఎవరు కూడా నియమ నిబంధనలు పాటించక ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు అంతేకాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమకు సహకరించాలని మండల ప్రజలను కోరారు