కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో లయన్స్ క్లబ్ గన్నేరువరం ఆధ్వర్యంలో గన్నేరువరం లో పల్లె ప్రకృతి వనం,వారసంతలో జోన్ చైర్ పర్సన్ బూర శ్రీనివాస్ ఆధ్వర్యంలో లయన్ నడిపెళ్లి వెంకటేశ్వర్ సర్పంచ్ పాలకమండలి ద్వారా 30 సిమెంట్ బెంచీలు ఈ రోజు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు పదవి భాద్యతలు మొదటిసారి చేపడుతూ లయన్ భవనం వద్ద చెట్లు నాటి వారి యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం జరిగినది. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా RMP డాక్టర్ ల చే మధుమేహ వ్యాధి నిర్దారణ మరియు బ్లడ్ ప్రేషర్ పరీక్షలు గ్రామస్తుల కు నిర్వహిచం జరిగింది. అనంతరం డాక్టర్లకు సన్మానించి వారి యొక్క సేవలను గురించి మాట్లాడి ప్రశంసలు అందించడం జరిగింది . వరల్డ్ పోష్టల్ డే సందర్భంగా పోస్టుమాన్ జాలి భాలరెడ్డి ని వారి సేవకు గాను హనరింగ్ చేశారు. అనంతరం ప్రపంచ వ్యవసాయ రోజు సందర్భంగా ఒక రైతు కు సన్మానించారు. నూతన లయన్ ఫ్యామిలీ మెంబర్స్ లయన్ గంప మల్లీశ్వరి, లయన్ బూర రాజమని ని చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జీల ఎల్లయ్య, జోన్ చైర్సన్, కార్యదర్శి లయన్ శ్రీనివాస్ తిప్పారం, (సెక్రెటరీ ).లయన్ తేల్ల భాస్కర్ (ట్రెజర్ ).లయన్ తేల రవీందర్ .లియో ప్రెసిడెంట్ గంట గౌతమ్ పొన్నాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు
