ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరిలకు వారం రోజుల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ గత ఏప్రిల్ లో తాము ఇచ్చిన ఆదేశాలను వీరు అమలు చేయకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని వ్యాఖ్యానించింది. ఈనాటి విచారణకు ఇద్దరు అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరికీ చెరో వారం రోజుల పాటు జైలు శిక్షను విధించింది. హైకోర్టు వెలువరించిన తీర్పు ఉన్నతోద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.