కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామ సర్పంచ్ బేతేల్లి సమత ఆమె భర్త బేతేల్లి రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. గత కొన్ని రోజుల నుండి పార్టీలో విభేదాలు రావడంతో సర్పంచ్ బేతేల్లి సమత మరియు ఆమె భర్తను కొంత మంది టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్న గుండ్లపల్లి గ్రామ ప్రజలకు సేవలు అందిస్తారని వారు తెలిపారు