కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ నెహ్రూ చౌరస్తా వద్ద విశ్వ రత్న,బోధిసత్వ భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్.బాబా సాహెబ్ భీమ్రావు అంబేద్కర్ 130వ జయంతి ని పురస్కరించుకుని గ్రామంలో జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా స్వేరోస్ ఉపాధ్యక్షులు హనుమాన్లు యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా మరియు అజ్ఞానం విడనాడి విజ్ఞానం వైపు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కరీంనగర్ జిల్లా స్వేరోస్ ఉపాధ్యక్షులు హనుమాన్ల యాదగిరి కోరారు దళిత సామాజిక వర్గంలో పుట్టిన అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గా, సామాజికవేత్తగా, ఆర్థికవేత్తగా, ప్రేమ ,కరుణ ,సమతా ,శీలం ,మైత్రి, క్షమాగుణం మొదలైన విశిష్ట లక్షణాలు కలిగిన మహనీయుని గా పిలువబడుతున్న అంబేద్కర్ జయంతిని 150 దేశాలకు పైగా దేశాలలో జయంతిని నిర్వహిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గుడెల్లి ఆంజనేయులు , మండల రైతు బంధు సమితి సభ్యులు హనుమాన్ ల నర్సయ్య ,గ్రామ శాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు న్యాలపట్ల శంకర్ గౌడ్ ,జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు అంబేద్కర్ రాష్ట్ర యువజన సంఘాల ఉపాధ్యక్షులు సొల్లు అజయ్, వర్మ TAYS మానకొండూరు ఇన్చార్జి కొంకటి దేవవరం కారోబార్ అంజయ్య ,నేలపట్ల పరుశురాం గౌడు ,నాగపురి శంకర్ గౌడ్ , నేలపట్ల పరుశరామ్ గౌడ్ , దొమ్మటి శంకర్,నేలపట్ల భిక్షపతి గౌడ్, తాళ్లపల్లి రవి గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.