భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాజుపేటకాలనీలో గురువారం గుప్తనిధుల ముఠాను పట్టుకున్నట్టుగా భద్రాచలం ఎఎస్పి డా.వినీత్ తెలిపారు. ఎఎస్పి తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం షుమారు 7.00 గంటల సమయంలో భద్రాచలం సిఐ స్వామి తన సిబ్బందితో అంబెడ్కర్ సెంటర్ నుండి రాజుపేట కాలనీ వరకు ఫుట్ పెట్రోలింగ్ చేయుచుండగా, రాజుపేట కాలనీ లోపల ఓం శివపార్వతి కిరాణా షాప్ ముందు టియస్12ఇయం9090 బ్రీజా కార్ లో 6 గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు 1. షేక్ కరీం, తండ్రి హంజా, 43 సం. లు, కథల్ గూడ, నల్గొండ, 2, గుడిసె రాజు, తండ్రి ఎల్లయ్య, 29 సం. లు, ముదిరాజ్, పానగల్లు, నల్గొండ, 3, పారుశెట్టి హర్షవర్ధన్, తండ్రి శశికాంత్, 20 సం. లు, బలిజ, నల్గొండ, 4. జంగాల అనిల్, తండ్రి పరమేష్, 19 సం. లు, మాల, గడ్డంవారి ఎడవెల్లి, కానగల్, నల్గొండ, 5. కాడింగు ప్రవీణ్, తండ్రి కృష్ణయ్య, 21 సం. లు, ముదిరాజ్, గడ్డంవారి ఎడవెల్లి, కానగల్, నల్గొండ, 6.గుత్తా ప్రసాద్, తండ్రి నారాయణ, 55 సం. లు, కమ్మ, ఏటపాక, తూర్పుగోదావరి జిల్లా అని విచారణలో తెలిసిందన్నారు. వారు కొంత కాలంగా గుప్త నిధుల వేటలో ఉన్నామని, 2 నెలల క్రితం రాజుపేట లోని ముగ్గురు ఆడవాళ్లు ఉన్న ఇంట్లో షుమారు 300 కోట్ల రూపాయల నిధి వున్నదని తెలిసి హైద్రాబాద్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి అంజనం వేసి చూడగా ఇంకా ఆ ఇంట్లోనే ఆ నిది వున్నదని చెప్పగా అట్టి నిధిని ఎలాగైనా సంపాదించలనే ఉద్దేశ్యం తో పథకం ప్రకారం ఒక నకిలీ తుపాకీ కొని, తాళాలు కట్ చేసే కట్టర్ మరియు ఒకవేళ అట్టి ఆడవాళ్లు తిరుగబడితే వాళ్ళను కొట్టి ఐన అట్టి నిధిని దొంగిలించాలనే ఉద్దేశ్యం తో రాజుపేట కాలనీ కి వారు రాగా పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.. వారి వద్ద నుండి ఒక నకిలీ తుపాకీ, 2 ఇనుప రాడ్లు, తాళాలు కట్ చేసే కట్టర్, టి ఎస్ 12 ఇ యం 9090 బ్రీజ కార్ ను సీజ్ చేసామని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి పంపించడం జరిగిందని ఆయన అన్నారు. ఎవరైనా గుప్త నిధుల పేరుతో మోసం చేసేందుకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని గుప్తనిధుల ఆశలో ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టౌన్ సిఐ స్వామి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.