కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాని పల్లె గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి రాజేందర్ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని జిల్లా కలెక్టర్ శశాంక విచారాన్ని వ్యక్తం చేశారు శుక్రవారం కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో కార్యదర్శి రాజేందర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు కలెక్టర్.