భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చర్ల మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘలైన తుడుందెబ్బ, AVSP, ATA మరియు ATF సంఘాల నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుడుందెబ్బ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు గంధం రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తుడుందెబ్బ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తాటి లక్ష్మణ్ మరియు చర్ల మేజర్ పంచాయితీ సర్పంచ్ కాపుల కృష్ణా హాజరైయ్యారు. ముందుగా కోమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు జి. నాగరాజు, కె. వెంకటేశ్వర్లు, రమేష్, నరేష్, AVSP నాయకులు నూప నగేష్, పి. హేమసుందర్, ATA నాయకులు బి. సత్యనారాయణ, రాజకుమార్, ATF నాయకులు CH. హిమగిరి, T. పాపరావు తదితరులు పాల్గొన్నారు