కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని వివిధ గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని,అందుకు రైతులు సహకరించాలని తహశీల్దార్ రవీందర్ తెలిపారు. చిగురుమామిడి తాసిల్దార్ గా మరోసారి రవీందర్ బాధ్యతలు చేపట్టారు.ఎన్నికల సందర్భంగా చిగురుమామిడి నుండి పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ కు బదిలీ అయ్యారు. చిగురుమామిడి లో జరిగిన పెట్రోల్ దాడి ఘటన రెవెన్యూ అధికారులను ఆందోళన కు గురి చేసిన విషయం తెలిసిందే.దీనిలో భాగంగానే ప్రస్తుతం పనిచేసిన ఫారుక్ ను కరీంనగర్ కలెక్టరేట్ కు బదిలీ చేసి మరోసారి రవీందర్ కు అవకాశం కల్పించారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే రెవెన్యూ సిబ్బంది తో సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కి సూచించారు. చిగురుమామిడి లో తాసిల్దార్ గా పనిచేస్తున్న అధికారులు తరచూ బదిలీలు కావడంతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి నానా ఇబ్బందులు పడుతున్నారు.