హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు రేపు ఆగిపోనున్నాయి. ఈ విషయాన్ని మెట్రో రైల్ యజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ సూచనల మేరకు రేపు మెట్రో రైల్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు యావత్ దేశం జనతా కర్ఫ్యూని పాటిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పిలుపుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు మద్దతును ప్రకటించాయి. ప్రజలు కూడా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూని పాటించేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో కూడా తన సేవలను ఆపేస్తోంది.
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) March 21, 2020