contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు సైనికుల మృతి

 శ్రీనగర్  లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయాయి. శ్రీనగర్ శివార్లలోని హెచ్ఎంటీ ప్రాంతంలో సైనికులపై దాడి చేశాయి. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లపై ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, మన సైనికులపై ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ ప్రాంతంలో జైషే మొహమ్మద్ కదలికలు ఉన్నాయని… సాయంత్రంలోగా ఈ ఘాతుకానికి పాల్పడిన గ్రూపు ఏదో గుర్తిస్తామని తెలిపారు. కాల్పులు జరిపిన వెంటనే ఉగ్రవాదులు కారులో పరారయ్యారని చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థానీలు, ఒకరు స్థానికుడని భావిస్తున్నామని తెలిపారు.జమ్ము-శ్రీనగర్ హైవేపై ఉన్న నగ్రోటా వద్ద ఓ ట్రక్కులో దాక్కున్న నలుగురు జైషే ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇటీవలే మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :