ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా పరిణామాలపై స్పందించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తడంలేదని విమర్శించారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే టీడీపీ ‘తెలంగాణ దేశం పార్టీ’గా మారిపోయిన విషయం అర్థమవుతుందని అన్నారు.
చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నది టీడీపీయేనని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం ఆ కోవలోకే వస్తుందని తెలిపారు.