అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం కమిషనరేట్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా నాలుగు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 101క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని మొలాంగూరు,వంకాయగూడెం,తాడికల్ గ్రామాల్లో జరిపిన తనిఖీల్లో 80 క్వింటాళ్ళు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 31 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
ఈ సందర్భంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాలతో లతో పాటు సంబంధిత వాహనాలు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించారు